AP Government: తిరుపతి నగరంలో దేవతా మూర్తుల చిత్రాల్ని చెరిపివేశారంటూ సాగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై వివరణ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలోని గోడలపై చిత్ర పటాల విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలోని గోడలపై దేవతా మూర్తుల బొమ్మలు కిలోమీటర్ల మేర ఉండేవని..వీటిని చెరిపి..మత విశ్వాసాల్ని అగౌరవపరిచారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. 


తిరుపతి నగరంలోని గోడలపై దేవతామూర్తుల బొమ్మల్ని చెరిపేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇదంతా దుష్ప్రచారమని తెలిపింది. వాస్తవానికి తిరుపతి నగరంలో సుందరీకరణ పనులు కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. నగరంలోని కీలకమైన ప్రాంతాల్లోని గోడలపై ఉన్న జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల చిత్రాలు వెలిసిపోయాయి. దాంతో కొత్తగా పెయింటింగ్ పనులు చేస్తూ..తిరిగి అవే చిత్రాల్ని వేస్తున్నారు. 


ఉన్న చిత్రాల్నే కొత్తగా వేస్తున్నామని..దేవతల బొమ్ముల్ని చెరిపి ఓ పార్టీ రంగులు వేయడమనేది పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం వెల్లడించింది. నగరంలో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా పెయింటింగ్ పనులు జరుగుతున్నాయని వివరించింది. తిరుమల బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం, తిరుపతి కార్పొరేషన్ అభివృద్ధి పనులు చేపట్టాయి. 


Also read: Actor Ali: వైసీపీని వీడే ప్రసక్తే లేదు..సీఎం వైఎస్ జగనే నా నేత: ఆలీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook