Covid Review: కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల లభ్యతపై సమీక్షించింది. ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వైరస్(Corona virus) ఉధృతి పెరుగుతోంది. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం (Ap government) ఆక్సిజన్ సరఫరా, మందుల లభ్యత , బెడ్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది. కరోనా నివారణ చర్యలపై మంత్రి ఆళ్ల నాని (Minister Alla nani) సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల ( Remdesivir injections) కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివర్ కొరత లేకుండా చూస్తామని తెలిపారు.


ఇక ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 40 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్‌ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్‌ టెస్టుల ( Covid Tests) ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మరోవైపు వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించింది ప్రభుత్వం. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.


రోజువారీ అవసరాలకు 330 టన్నుల ఆక్సిజన్ (Oxygen Supply) కావాలని.. ప్రస్తుతం 290 టన్నుల ఆక్సిజనే అందుబాటులో ఉందని వైద్యశాఖ తెలిపింది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 42 ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాకు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాస్థాయిలో జేసీకి బాధ్యతలు అప్పగించింది. భువనేశ్వర్, బళ్లారి, విశాఖ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ( Visakha steel plant) లో రెండు ప్లాంట్‌లు నిర్వీర్యంగా ఉన్నాయని..వాటిని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan).. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి తెలిపారు.


Also read: AP Coronavirus Update: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook