New Ration Cards: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. దీనికి సంబంధించి ఇవాళ అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకూ దరఖాస్తులు స్వీకరించనుందనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్లు దాఖలు చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల జారీ విషయంలో స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇదంతా అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకై ఏ విధమైన అధికారిక ప్రకటన జారీ కాలేదని వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాలలో అప్లికేషన్ దాఖలు చేయాలని కూడా ఆప్షన్ ఇవ్వలేదని వివరించింది. 


గత ప్రభుత్వం ఇప్పుడున్న రైస్ కార్డులు ఎక్కడా ఓపెన్ కాకుండా చేసిందని, అందుకే పాత కార్డులు తొలగిచి కొత్త కార్డులు జారీ చేస్తారని తెలుస్తోంది. రేషన్ కార్డులకు సంబంధించి జనవరి లేదా మార్చ్ మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ కానుందని అంచనా. 


కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తుకు కావల్సిన వివరాలు


కుటుంబ సభ్యుల ఫోటో ( 4/6) పరిమాణంలో వెనుకవైపు వైట్ లేదా క్రీమ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండాలి. కుటుంబసభ్యుులందరి ఆధార్ కార్డు జిరాక్స్ అవసరమౌతాయి. కుటుంబ యజమాని మ్యారేజ్ సర్టిఫికేట్. కుల ధృవీకరణ పత్రం కొత్తది తీసుకోవాలి. ఆధార్-పాన్ కార్డు లింక్డ్ బ్యాంక్ ఎక్కౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ సిద్ఘంగా ఉంచుకోవాలి. రేషన్ కార్డులకై నోటిఫికేషన్ వెలువడగానే ఈ వివరాలతో సమర్పించాలి. 


Also read: Geyser Usage Tips: గీజర్ ఇలా వినియోగిస్తున్నారా, ఈ జాగ్రత్తలు తప్పకుండా ఫాలో కావల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.