Geyser Usage Tips: దేశంలో ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ గీజర్లు, వాటర్ హీటర్ వాడకం పెరుగుతోంది. అదే సమయంలో ప్రమాదాల ముప్పు కూడా వెంటాడుతుంది. గీజర్ల వాడకం విషయంలో కొన్ని సూచనలు పాటించకుంటే ప్రమాదాలు పెరగవచ్చు. గీజర్ వినియోగించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలక్ట్రిక్ షాక్ తగలడం, గీజర్లు పేలడం వంటివి సంభవించవచ్చు.
గీజర్ వినియోగించేటప్పుడు ప్రమాదాలు నివారించేందుకు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు. స్నానం చేసే సమయంలో గీజర్ ఆఫ్ చేయడం అన్నింటికంటే ఉత్తమం. ఎందుకంటే బయట్నించి విద్యుత్ సరఫరా జరిగేటప్పుడు హై వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ సమస్య ఎదురైతే ఎలక్ట్రిక్ షాక్ తగలవచ్చు. స్నానపు గదిలో అంతా తడిగా ఉంటుంది కాబట్టి షాక్ తీవ్రత పెరిగిపోతుంది. అందుకే స్నానానికి ముందు 10-15 నిమిషాలు ఆన్ చేసి ఆ తరువాత ఆఫ్ చేసి స్నానం చేస్తే మంచిది.
ఇక గీజర్ కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చౌకగా దొరికే అన్ బ్రాండెడ్ గీజర్లు అస్సలు వాడకూడదు. బ్రాండెడ్ గీజర్లు, నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేషన్ ఉంటేనే తీసుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. గీజర్ కొనుగోలు చేసేటప్పుడు పూర్తిగా చెక్ చేసుకోవాలి. విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. ప్రతి ఏడాది తప్పకుండా సర్వీసింగ్ చేయాలి. ఎప్పటికప్పుుడు సర్వీసింగ్ అనేది తప్పకుండా చేయించాల్సి ఉంటుంది.
ఇక చాలామంది చేసే పొరపాటు గీజర్ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచడం లేదా ఆన్ చేసి మర్చిపోవడం. ఇది అత్యంత ప్రమాదకరం. గీజర్ పేలిపోవచ్చు. అందుకే 10-15 నిమిషాల కంటే ఎక్కువ సేపు గీజర్ ఆన్ చేసి ఉంచకూడదు. గీజర్ అతిగా వేడి చేయవద్దు. రోజుకు 2-3 సార్లే గీజర్ ఆన్ చేయడం అన్నింటికంటే ఉత్తమం.
Also read: TTD Guidelines: టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ, ఎల్లుండి నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.