వైద్యం-విద్యపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం ( Ap Government ) అక్రమ విద్యాలయాలపై కొరడా ఝులిపిస్తోంది. మొన్న 25 ప్రైవేటు స్కూల్స్ ను మూసివేసిన ప్రభుత్వం ఇప్పుడు 48 డిగ్రీ కళాశాలలపై వేటు వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం  ( Ap cm ys jagan ) ప్రధానంగా వైద్యం-విద్యపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నాడు-నేడు ( Naadu-nedu ) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్న ప్రభుత్వం అక్రమంగా పుట్టుకొచ్చిన విద్యాలయాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా 25 అక్రమ విద్యాలయాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రముఖ సంస్థలైన నారాయణ, చైతన్య, భాష్యం, రవీంద్రభారతితో పాటు తిరుమల విద్యాసంస్థలున్నాయి. అనుమతుల్లేకుండా నిర్వహించడం, వసతులు లేకపోవడం, అధిక ఫీజులు, సరైన అర్హత కలిగిన టీచర్లు లేకుండా స్కూల్స్ నడపడం వంటివి పరిగణలో తీసుకుంది. 


ఇప్పుడు అదే క్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. రాష్ట్రంలో కొన్ని కళాశాలలు ఏ యూనివర్శిటీ అనుబంధం లేకుండా కొనసాగుతుంటడం, వసతులు లేకపోవడం వంటి కారణాలతో మొత్తం 246 కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ విచారణ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. నిర్ణీత డాక్యుమెంట్లతో కమిటీ ముందు హాజరు కావల్సిఉంటుంది. కొన్ని కళాశాలలు ఇప్పటికే కమిటీ విచారణకు హాజరై...వివరణ ఇచ్చాయి. మరికొన్ని కళాశాలలు విచారణకే హాజరు కాలేదు. కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్ని పూర్తిగా రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి...మరో 61 కళాశాలల్లోని కొన్ని ప్రోగ్రామ్ లను ఉపంహరించింది. 


నన్నయ యూనివర్శిటీ పరిధిలో 50 కాలేజీలకు షోకాజ్ నోటీసులు పంపించగా..7 కళాశాలల్ని రద్దు చేశారు. ఏయూ పరిధి ( Andhra university ) లో 42 కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే...12 కాలేజీల్ని రద్దు చేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో  23 కాలేజీలకు షోాకాజ్ నోటీసులు అందించగా..7 కళాశాలల్ని రద్దు చేసింది ప్రభుత్వం. ఎస్వీ యూనివర్శిటీలో పరిధిలో 39 కాలేజీలకు షోకాజ్ నోటీసులు అందించి..11 కళాశాలల్ని రద్దు చేశారు. కృష్ణా యూనివర్శిటీ పరిధిలో 22 కాలేజీలకు నోటీసులు అందించి...4 కళాశాలల్ని రద్దు చేశారు. ఇక ఎస్కే యూనివర్శిటీ పరిధిలో 13 కళాశాలలకు నోటీసులు అందించారు. Also read: AP: ఆ అధికారి విచారణలో నాట్ బి ఫోర్ మి