Ap Curfew Extension: ఏపీలో కర్ఫ్యూ మే 31 వరకూ పొడిగింపు, గ్రామీణ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టం
Ap Curfew Extension: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చర్యలకు ఆదేశించారు.
Ap Curfew Extension: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చర్యలకు ఆదేశించారు.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశం అల్లకల్లోలంగా మారుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్ ( Lockdown) అమలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తోంది. మే 5 వతేదీ నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ (Curfew) అమల్లో ఉంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అంటే రోజుకు 6 గంటల సేపు నిత్యావసరాలు, మార్కెట్‌కు వెసులుబాటు ఉంటుంది. గత కొద్దిరోజులుగా ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజులో ఏకంగా 24 వేల కేసులు బయటపడ్డాయి. అటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా రాష్ట్రంలో భారీ ఎత్తున చేస్తున్నారు. ప్రతిరోజూ 90 వేల నుంచి లక్ష వరకూ పరీక్షలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో రాకపోవడంతో కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం (Ap government) నిర్ణయించింది. మెరుగైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అందుకే ఈ నెలాఖరు వరకూ అంటే మే 31వ తేదీ వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూ(Curfew) అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్నించే ఎక్కువగా కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కోవిడ్ కారణంగా ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే పిల్లల్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ పిల్లలకు ఆర్ధిక సహాయం అందించేలా తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. పిల్లల పేరుమీద తగిన మొత్తాన్ని డిపాజిట్ చేసి..దానిపై ప్రతినెలా వచ్చే వడ్డీని వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచించాలన్నారు.
Also read: AP Lockdown: సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ఏపీ ప్రభుత్వం, రేపు నిర్ణయం వెలువడే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook