AP Corona Update: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తగ్గుదల కొనసాగుతోంది. వారం రోజుల్నించి క్రమేపీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో గత 24 గంటల్లో 89 వేల 732 కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) నిర్వహించగా, కొత్తగా 7 వేల 796 మందికి పాజిటివ్‌గా నిర్థారణైంది. అదే సమయంలో 14 వేల 641 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 16 లక్షల 51 వేల 790 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 14 వేల మంది కోలుకున్నారు. ఇటు 77 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 7 వేల 588 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 1 కోటి 99 లక్షల 46 వేల 253 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.


గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1302 మందికి కరోనా సోకింది. అటు చిత్తూరు జిల్లాలో 1210 అనంతపురంలో 918, విశాఖపట్నంలో 672, పశ్చిమ గోదావరి జిల్లాలో 755 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో అత్యధికంగా 12 మంది గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా మరణించారు.


Also read: Covid19 Vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook