Covid19 Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) విషయంలో ఏపీ ప్రభుత్వం (Ap government) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఏపీలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నారులపై థర్డ్‌వేవ్ ప్రభావం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ మేరకు అర్హులైన తల్లులకు వ్యాక్సిన్ వేయించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒకరోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి..వ్యాక్సిన్ అందించాలని సూచించింది. చిన్నారుల తల్లులకు ఇచ్చే టోకెన్లలో వ్యాక్సిన్ సమయం, తేదీ ప్రకారం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు కోవిడ్ వ్యాక్సినేషన్ (Corona vaccination) కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.
5 ఏళ్ల లోపు చిన్నారుల తల్లులకి వ్యాక్సిన్ వేయాలని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. అర్హులైన తల్లులు 15 నుంచి 20 లక్షల మంది ఉంటారని అంచనా. కోవిడ్ వచ్చిన చిన్నారులతోపాటు తల్లులను సహాయకులుగా ఆస్పత్రుల్లో ఉంచాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక ఇచ్చింది.
Also read: AP CM YS Jaganకు లేఖ రాసిన కృష్ణపట్నం Anandaiah, సహకారం కోసం విజ్ఞప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook