Ap Governnement Follows pawan kalyan strategy: ఇటీవల ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో విజయం అందించారు. దీనికి తగ్గట్టునే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో స్పీడ్ ను పెంచారు. గత వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా వెనక్కునెట్టారని ఆరోపించారు. ఇష్టమున్నట్లు డబ్బులు ఖర్చుచేసి, ఏపీని  డెవలప్ చేయకుండా, పూర్తిగా అప్పులు ఊబిలోకి కూరుకుపోయేలా చేశానని  తీవ్రంగా విమర్శించింది. ఐదేళ్ల పాటు ఒక వైపు పెట్టుబడులు రాకుండా,  అన్నిరకాల వ్యవస్థలు కూడా భ్రష్టుపట్టించేలా పాలనచేశారని చంద్రబాబు అనేక సందర్భాలలో ఫైర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


ఏ శాఖ చూసిన కూడా అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆదాయం మాత్రంలేవని కూడా చంద్రబాబు పలు మార్లు శ్వేత పత్రాలు సైతం విడుదలు చేశారు. ఇన్ని సమస్యలున్న కూడా కేంద్రం సహాకారంలో.. పేదలకు ఫించన్ లను పెంచామని, మొదటి తారీఖున సర్కారు ఉద్యోగులకు జీతం ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల చంద్రబాబు.. సీఎం అయ్యాక తొలిసారి నిన్న అనాకాపల్లి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు, ప్రజలు స్టేజీ మీద రెడ్ కార్పేట్ లు వేసి చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.


ప్రజలు, స్థానిక నేతలు, అధికారులకు చంద్రబాబు కొన్నిసూచనలుచేశారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఖజానా ఖాళీగాఉందని, దయచేసి రెడ్ కార్పేట్లు, మరే ఇతర ఆర్భాటాలకు ప్రభుత్వ సొమ్మును లేదా పర్సనల్ డబ్బులను దండగా చేసుకోవద్దన్నారు. మనందరి టార్గెట్ కేవలం ఏపీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే అని అన్నారు. దీనికోసం.. ప్రజలు , అధికారులు, పార్టీల కతీతంగా రాజకీయ నేతలు ముందుకు రావాలన్నారు. 



ఇదిలా ఉండగా.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాయంలో ఫర్నీచర్ కోసం కొందరు అధికారులు ఆయన్ను కలిశారు. ఎలాంటి ఫర్నీచర్ కావాలో ఆయన దగ్గరకు వచ్చి ఆరా తీశారు. దీంతో ఆయన తాను.. పలు శాఖలకు మంత్రిగా ఉన్నానని, ఏ శాఖ చూసిన రెవెన్యూ లోటు ఉందని చెప్పుకొచ్చారు. తన ఆఫీసు ఫర్నీచర్ కు సొంత డబ్బులతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో హజరైనందుకు, ఆయనకు ప్రభుత్వ నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చేందుకు అఫిషియల్ ఫార్మాలిటీస్ కోసంసచివాయం సిబ్బంది పవన్ ను కలిశారు. వారితో కూడా మీరు ఇచ్చే డబ్బులు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు, మరేదైన కొనుగోలు చేయడం కోసం పనికొస్తుందని అన్నారు.


Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..


తన ఆఫీసుకు కావాల్సిన ఫర్నీచర్ తానే కొనుక్కుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఇటీవల ఒక జీవో సైతం విడుదల చేసింది. సచివాలయం,కలెక్టర్ లు, ఓఎస్డీలు తమకు ఫర్నీచర్ లు, కంప్యూటర్ లు, సోఫాలు కావాలని ఏపీ ఆర్థిక శాఖకు బిల్లులు పెట్టుకున్నారు. దీనికి కౌంటర్ గా ఏపీ సర్కారు.. 2026 మే 31 వరకు ఎలాంటి కొత్త ఫర్నీచర్ లు కొనుగోలు చేయోద్దని, ఇప్పుడు ఉన్నవాటిని ఉపయోగించుకొవాలని స్పష్టంగా జీవో జారీ చేసింది. ఏపీ మరల పుంజుకునే వరకు ఒకటి, రెండెళ్ల వరకు, సంపద క్రియేట్ అయ్యేవరకు అందరు సహాకరించాలని కూడా ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్  స్ట్రాటజీనీ, ఏపీ సర్కారు ఫాలో అయినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.