AP High Court Shock: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ సభ విజయవంతం కావడంతో ఊపుమీదున్న ఉద్యోగ సంఘాలకు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు వివాదం నడుస్తోంది. విజయవాడలో తలపెట్టిన సమ్మె విజయవంతం కావడంతో మంచి ఊపు మీదున్న ఉద్యోగ సంఘాలు పెన్‌డౌన్‌కు పిలుపిచ్చాయి. ఇదే సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చింది. పీఆర్సీ జీవోల రద్దు కోరుతూ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సమ్మెను నిలువరించాలంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మథరావు బెంచ్ ఈ పిటీషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించింది.


చట్ట విరుద్ఘంగా ఏం జరిగినా నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆ స్వేచ్ఛ ప్రభుత్వానికుందని స్పష్టం చేసింది. పెన్‌డౌన్ అయినా సమ్మె అయినా రూల్ 4 కింద నిషేధముందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ..తగిన చర్యలు తీసుకోవల్సిన బాథ్యత ప్రభుత్వానిదే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పరిపాలన సవ్యంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడలో జరిగిన ర్యాలీకు కూడా అనుమతి ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం మాత్రం అనుమతి లేదని కోర్టుకు వివరించింది. మరో రెండ్రోజుల్లో పరిస్థితులన్నింటినీ పరిగణలో తీసుకుని విచారణ సాగిస్తామని హైకోర్టు(Ap High Court) స్పష్టం చేసింది. చట్ట విరుద్ధ కార్యక్రమాల్ని ప్రభుత్వం నియంత్రిస్తుందని హైకోర్టు ఆశించింది. ఉద్యోగులు ఏం చేయనున్నారో తెలియకుండా స్పందించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోవిడ్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.


Also read: Guntur Road Accident: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌... ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook