AP Corona Update: ఏపీలో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు, 24 గంటల్లో 21 వేల కేసులు
AP Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది.
AP Corona Update: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి దేశం మొత్తం అల్లకల్లోలంగా మారుతోంది. గత 24 గంటల్లో ఇండియాలో అత్యధిక స్థాయిలో 4 లక్షల 12 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ సంక్రమణ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం (Ap government) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముందు నైట్‌కర్ఫ్యూ అమలు చేసిన ప్రభుత్వం ఆ తరువాత మే 5వ తేదీ నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ (Curfew) అమలు చేస్తోంది. మరోవైపు సంక్రమణ ఛైన్‌ను కట్టడి చేసేందుకు కరోనా నిర్ధారణ పరీక్షల్ని(Covid19 Tests) భారీగా పెంచింది. గతంలో అంటే మొదటి వేవ్ సమయంలో రోజుకు 60-70 వేల పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం..ఏకంగా 1 లక్షా 10 వేల పరీక్షలు చేస్తోంది. పరీక్షల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 21 వేల 954 కేసులు నమోదయ్యాయి. అటు 72 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు 10 వేల 141 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్షా 82 వేల 329 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటివరకూ 1 కోటి 70 లక్షల 60 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
మరోవైపు కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు తప్పనిసరిగా బెడ్స్ ఇవ్వాలని వైఎస్ జగన్ సూచించారు. ఉచితంగా పూర్తిగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు 50 శాతం బెడ్స్ కేటాయించాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ సామర్ధ్యం పెంచాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
Also read: AP Covid Strain: ఏపీలో ఆ వైరస్ లేదని స్పష్టం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook