Oxygen Plants: ఏపీలో కొత్త ఆక్సిజన్ పాలసీ, ప్రైవేట్ సెక్టార్‌లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం
Oxygen Plants: కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాస్ తుపాను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఆక్సిజన్ సిద్ధం చేసుకుంది. మరోవైపు ఆక్సిజన్ విషయంలో కొత్త పాలసీను ప్రవేశపెట్టబోతోంది.
Oxygen Plants: కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాస్ తుపాను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఆక్సిజన్ సిద్ధం చేసుకుంది. మరోవైపు ఆక్సిజన్ విషయంలో కొత్త పాలసీను ప్రవేశపెట్టబోతోంది.
దేశంలో కోవిడ్19ను ఎదుర్కోవడంతో ఏపీ ప్రభుత్వం (Ap government) ముందంజలో ఉంటోంది. కోవిడ్ పరీక్షల నిర్వహణలోనూ, బెడ్స్ ఏర్పాటులోనూ, వ్యాక్సినేషన్‌లో సైతం ఏపీ ప్రభుత్వం పత్యేక చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)..ఆక్సిజన్ విషయంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టారు. ఈ వివరాల్ని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న 32 వేల బెడ్స్‌కు 660 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని..కేంద్ర ప్రభుత్వం (Central government) మాత్రం 590 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తోందన్నారు. దాంతో ప్రతిరోజూ అదనంగా 150 టన్నుల ఆక్సిజన్ రప్పిస్తున్నామని తెలిపారు. మరోవైపు యాస్ తుపాను (Yaas Cyclone) వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగా 4 వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకూ జామ్‌నగర్ నుంచి నాలుగు ఆక్సిజన్ రైళ్లు వచ్చాయని..ఆక్సిజన్ రవాణా కోసం 92 లారీల్ని, సరఫరా కోసం 16 కంటైనర్లను సిద్ధం చేశారు. ఇక ఎప్పటికీ ఆక్సిజన్ కొరత రాకుండా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం (Oxygen plants in private sector) చేపట్టనుంది. 120 కోట్ల రూపాయలతో ఆసుపత్రుల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నారు.
Also read: AP Exams: ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook