అమరావతి: ఏపీలో గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి (Grama volunteer posts recruitment) ఏపీ సర్కార్ తాజాగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా 25వ తేదీన దరఖాస్తులను పరిశీలించనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి మే 1న నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ వాలంటీర్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా నేడు ఏపీ సర్కార్ విడుదల చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Viral video: పాములు కూడా లాక్ డౌన్ పాటిస్తున్నాయా ? వైరల్ వీడియో


గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అర్హత కలిగి ఉండాలంటే.. వయస్సు రీత్యా జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్ల వయసు నిండి 35 ఏళ్లకు మించని వాళ్లు అయ్యుండాలి. గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయితే చాలు. గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్, పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న వారై ఉండాలి. లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అవకాశం లేని వారు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో సంప్రదించి, అక్కడ సిబ్బంది సహయంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 


Also read: Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య


ఆన్‌లైన్‌ అప్లికేషన్ లింక్:
ఆన్‌లైన్‌లో https://gswsvolunteer.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..