కోవిడ్ 19 ( Covid19 ) నేపధ్యంలో ఇంకా స్కూల్స్, కళాశాలలు తెర్చుకోవల్సి ఉంది. అన్ లాక్ 4 గైడ్ లైన్స్ ( Unlock 4 Guidelines ) ప్రకారం ఏపీ విద్యాశాఖ తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. స్కూల్స్ తెరిచేంందుకు ఈ చర్యలు తప్పనిసరి ఇక..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా మార్చ్ నుంచి స్కూల్స్, కళాశాలలు మూతపడ్డాయి. ఈ విద్యాసంవత్సరం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించుకుంటున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 మార్గదర్శకాల్లో స్కూల్స్, కళాశాలలు తెరవడంపై స్పష్టమైన సూచనలున్నాయి. దీని ప్రకారం ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు విద్యాశాఖ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది. 


కంటైన్మెంట్ జోన్లకు ( outside of containment zones ) వెలుపల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు , ఎయిడెట్ విద్యాసంస్థలు మాత్రమే తెరవాల్సి ( Reopen of schools ) ఉంటుంది. అయితే 50 శాతం వరకూ టీచర్లు హాజరుకావచ్చు. అది కూడా ఆన్ లైన్ టీచింగ్, టెలీ కౌన్సిలింగ్ వంటి వాటి నిర్వహణ కోసం.


ప్రతి ఒక్కరూ ఆరడుగుల దూరం పాటించాల్సిందే. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. విద్యార్ధులు, సిబ్బందిని కోవిడ్ నుంచి రక్షించడానికి అన్ని చర్యల్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, యాజమాన్యం చేపట్టాలి. ఎవరికైనా సరే జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. టిష్యూ పేపర్లు, కర్చీఫ్ లు నిర్దేశిత ప్రాంతాల్లో పారవేసేట్టు చూడాలి. 


తరగతి గదులు, లేబొరేటరీలు, తరచూ వినియోగించే ఇతర ప్రదేశాల్ని పరిశుభ్రంగా ఉంచాలి. నోటుబక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్ బాటిల్స్ ఎక్స్చేంజ్ చేయడాన్ని అనుమతించకూడదు. ఇక మరీ ప్రధానంగా 1 నుంచి 8 వ తరగతి విద్యార్ధులు ( online education for 1-8 classes ) మాత్రం ఇంటి నుంచి విద్యాభ్యాసం కొనసాగించాలి. స్కూళ్లకు పిలిపించకూడదు. అవసరమైన పక్షంలో పేరెంట్స్ ని మాత్రమే పిలిచి మాట్లాడాలి. ఈ విద్యార్ధుల వర్క్ షీట్లను అభ్యాస యాప్ లో పొందుపరిచారు ఇప్పటికే. వాటిని డౌన్ లోడ్ చేసుకుని అభ్యాసం కొనసాగించాలి. 


సెప్టెంబర్ 21 నుంచి కంటైన్మెంట్ జోన్ వెలుపల తెరిచే స్కూల్స్, కాలేజీల్లోకి 9 నుంచి 12 వ తరగతి వరకు పిల్లలను మాత్రమే అనుమతించాలి. వీరిని బోధించే టీచర్లు, విద్యార్ధుల స్థాయిని బట్టి హైటెక్, లోటెక్, నోటెక్ గా విభజన ఉండాలి. ఇక గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్దుల విషయంలో టీచర్లు వాట్సప్ గ్రూప్ ల ద్వారా గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. Also read: AP: కరోనా పరీక్షల్లో ఏపీ టాప్ 1 లో...కేసుల్లో టాప్ 3లో