AP: కరోనా పరీక్షల్లో ఏపీ టాప్ 1 లో...కేసుల్లో టాప్ 3లో

కరోనా వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో ఇండియా టాప్ 2లో నిలిస్తే..ఇండియాలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో కొనసాగుతోంది. 

Last Updated : Sep 16, 2020, 06:32 PM IST
AP: కరోనా పరీక్షల్లో ఏపీ టాప్ 1 లో...కేసుల్లో టాప్ 3లో

కరోనా వైరస్ ( Coronavirus ) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో ఇండియా టాప్ 2లో నిలిస్తే..ఇండియాలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో కొనసాగుతోంది. 

దేశం కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 4-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఒకటిగా ఉంది. ప్రతిరోజూ దాదాపు 8-10 వేల కేసులు నమోదవుతున్నాయి. అటు దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల్లో రాష్ట్రం టాప్ 3లో ఉంది. అయితే ఇదంతా కేసుల సంఖ్యలోనే కాదు...కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో కూడా ఏపీ అగ్రభాగంలా నిలుస్తోంది. ముఖ్యంగా కరోనా నియంత్రణకు ప్రధానంగా చేయాల్సిన పరీక్షల విషయంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government )..దేశంలో ఏ రాష్ట్రం చేయనన్నికరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests ) నిర్వహిస్తోంది. రికార్డు స్థాయిలో ప్రతిరోజూ 60-70 వేల పరీక్షల్ని నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంది. పరీక్షలకు తగ్గట్టుగానే కేసులు కూడా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 75 వేల 13 మందికి పరీక్షలు నిర్వహించగా..8 వేల 835 మందికి పాజిటివ్ గా తేలింది. అటు మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 92 వేల 760కు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 81 వేల 64 కేసులు బయటపడగా..ప్రస్తుతం 12 వేల యాక్టివ్ కేసులున్నాయి. రెండవ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. ఈ జిల్లాలో 53 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. యాక్టివ్ కేసులు మాత్రం 8 వేల 7 వందలున్నాయి.

అయితే అదే సమయంలో గత 24 గంటల్లో 10 వేల 845 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 4 లక్షల 97 వేల 376కు చేరుకుంది. ఏపీలో ఇప్పటివరకూ అత్యధికంగా 48 లక్షల 6 వేల 879 పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 90 వేల 279 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. Also read: Actor Ali: దేశంలోనే బెస్ట్ సీఎం జగనే: అలీ

Trending News