AP Night Curfew: ఏపీలో మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్‌వేవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్‌వేవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటికే పగటిపూట కర్ఫ్యూని పూర్తిగా తొలగించి కేవలం నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. కరోనా సంక్రమణను పూర్తిగా అడ్జుకునేదిశగా నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష(Ap cm ys jagan) నిర్వహించారు. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)వస్తే సన్నద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ..విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదల్చిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆసుపత్రుల పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు.
పోలీస్ బెటాలియన్స్‌లలో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యుల్ని నియమించాలని..కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో ఆక్సిజన్ సిలెండర్లు, కాన్సంట్రేటర్లు, టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు.
Also read: Supreme Court: అమరావతి భూముల కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook