AP: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్టు విదార్ధులకు శుభవార్త అందించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బోర్డు పరిధిలోని వివిధ రకాల ఫీజుల్ని రద్దు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ( Ap Intermdiate Board )అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంక్షోభం ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా వివిధ రకాలైన ఫీజుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రీ అడ్మిషన్, మీడియంలేదా గ్రూప్ మార్పుకు సంబంధించి ఫీజు రద్దు ( Fees Cancelled ) చేస్తున్నట్టు వెల్లడించింది. వీటికి సంబంధించిన ఫీజుల్ని ఇకపై వసూలు చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  


కరోనా వైరస్ ( Corona virus )ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం  ( Ap Government ) ఇప్పటికే వివిధ రాయితీలు , ప్రోత్సాహకాల్ని ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ విద్యార్ధులకు మరింతగా వెసులుబాటు కల్పించేందుకు ఫీజుల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఫీజుల రద్దు నేపధ్యంలో రీ అడ్మిషన్ కోసమైనా లేదా తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు నుంచి తెలుగు మీడియంలోకి మారాలన్నా..లేదా గ్రూప్ మార్చుకోవాలన్నా...ఇకపై ఈ ఏడాదికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. Also read: AP: వైఎస్ జగన్ చేతుల మీదుగా భారీగా ఇళ్ల స్థలాల పంపిణీ.. ముహూర్తం ఖరారు