దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 25 నుంచి భారీ కార్యక్రమానికి అంకురార్పణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లా ( Chittoor District ) కార్యక్రమం కూడా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 30 లక్షల 66 వేల ఇళ్ల స్థలాల్ని పంపిణీ ( House Sites Distribution ) చేయనున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎక్కడనేది ఇంకా నిర్ణయం కాలేదు. కొన్నిచోట్ల కోర్టు స్టేల కారణంగా నిలిచిపోవడంతో మిగిలిన 27 లక్షల ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రతిపేదవాడికి సెంటున్నర స్థలం, పట్టణాల్లో అయితే సెంటు స్థలం చొప్పున 68 వేల 677 ఎకరాలు పంపిణీ చేయనున్నారు. ఇందులోంచి 25 వేల 359 ఎకరాల ప్రైవేట్ భూముల్ని 10 వేల 150 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలినవి ప్రభుత్వ భూములే.
Also read: Telangana: ఎవరెన్ని చెప్పినా..టీపీసీసీ అధ్యక్ష పదవి అతనికే..?