Ramadan Restrictions: కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ ప్రార్ధనలు ఎలా ఉండాలనేది స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap government) రంజాన్ పండుగపై ఆంక్షలు(Ramadan Restrictions)విధించింది. పండుగ ఎలా నిర్వహించుకోవాలనేది సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి కొనసాగుతున్నందున రంజాన్ పండుగకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13 లేదా 14 వతేదీన రంజాన్ పండుగ(Ramadan Eid) ఉంది.ఈ సందర్భంగా ఈద్గా, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక నమాజ్‌ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. రంజాన్ ప్రార్ధనల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాల్ని మైనార్టీ వెల్పేర్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ ప్రకటించారు. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్ధనల్ని ఇళ్లలోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు.


రంజాన్(Ramadan) రోజున మసీదుల్లో జరిగే ప్రార్ధనల్లో(Ramada prayers) 50 మందికి మించి పాల్గొనకూడదు. ప్రార్ధనల్లో మాస్క్ ధరించి..ఆరు అడుగుల భౌతిక దూరం పాటంచాలి. మాస్క్ లేకపోతే ఎవ్వరినీ మసీదుల్లో అనుమతించకూడదు. ప్రార్ధనలకు ముందు నిర్వహించే వుజూను ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి. కింద కూర్చునేందుకు వీలుగా జానీమాజ్ ఇంటి నుంచే తెచ్చుకోవాలి. మసీదు ప్రవేశద్వారం వద్ద తగిన సంఖ్యలో శానిటైజర్ అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుపు, జ్వరం, మధుమేహం, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి. ఈద్ శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం చేయకూడదు.


Also read: AP CM Ys Jagan Letter: కోవ్యాగ్జిన్ పేటెంట్ డీలైసెన్సింగ్ చేస్తేనే..ఉత్పత్తి పెరుగుతుంది : Ys Jagan


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook