Intermediate Exams: ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మరోసారి మారేలా కన్పిస్తోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలో మార్పుల కారణంగా..ఇంటర్, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడేలా కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఇంటర్నీడియట్, పదవ తరగతి విద్యార్ధులకు పరీక్షలెప్పుడనేది నిర్ధారణయ్యేందుకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సి ఉన్నాయి. అయితే జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఏప్రిల్ 22కు వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడటంతో పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈలోగా జేఈఈ మెయిన్స్ పరీక్షల మొదటి విడత పరీక్షల్ని ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకూ నిర్వహిస్తున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ షెడ్యూల్ సవరించింది. దేశవ్యాప్తంగా కొందరు విద్యార్ధుల అభ్యర్ధన మేరకు ఎన్టీఏ ఈ మార్పులు చేసింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో మొదటి విడత పరీక్షల్ని మే 24 నుంచి 29 వరకూ రెండవ విడత పరీక్షల్ని నిర్వహించనుంది.


దాంతో మరోసారి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడనుంది. విద్యార్ధులు ఏకకాలంలో రెండు పరీక్షలకు సన్నద్ధం కావడం కూడా కష్టంగా మారనుంది. దాంతో ఏపీ ప్రభుత్వం మరోసారి ఇంటర్మీడియట్ షెడ్యూల్ మార్చనుంది. ఇంటర్ షెడ్యూల్ మారితే..అటు పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మారవచ్చు.


Also read: AP Weather Report: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook