AP Weather Report: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

గత వారం రోజులుగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నవాటి కంటే పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేడిగాలులు మరో 3 రోజులు వీచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 11:04 AM IST
  • ఏపీలో పెడుతున్న ఉష్ణోగ్రతలు
  • మరో రెండు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు
  • జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ
AP Weather Report: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..  పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

AP Weather Report: రానుంది వేసవి కాలం.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు హెచ్చరిస్తుంది. గడిచిన వారం రోజుల నుండి కొన్నిప్రాంతాల్లో ఎండా తీవ్రత పెరుగుతూనే ఉంది. 

నిన్న సోమవారం కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. మరో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు ఏపీ రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

ఒక ఏపీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. మర్చి నెలలో గతంలో ఉన్నదాని కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కావున వచ్చే వేసవి మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా దేశంలో పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా మారటం వలన వడగాలులు, ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 

ఇక ఏపీ విషయానికి వస్తే.. రానున్న కాలంలో కృష్ణా, గోదావరి, కడప, ప్రకాశం, విశాఖ, విజయనగరం, వంటి జిల్లాల్లో వాతావరణం వేడెక్కి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని.. శరీరాన్ని డీ హైడ్రేటేడ్ గా ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్ల పట్ల ఎక్కువ శ్రద్ధ వచించాలని సూచిస్తున్నారు. 

Also Read: AAP Target Bengal: మొన్న ఢిల్లీ, నేడు పంజాబ్, రేపు బెంగాల్..ఆప్ టార్గెట్ అదే

Also Read: India Victory: వరుస విజయాలతో కొనసాగుతున్న టీమ్ ఇండియా జైత్రయాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News