AP: ఏపీలో ఈ పాస్ ఇకపై చాలా సులభం
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ప్రవేశించేవారికి ఇకపై ఈ పాస్ ( E Pass ) సులభతరం అవుతోంది. ఈ పాస్ అప్లై చేసుకున్నవెంటనే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతి లభించేస్తుంది. అన్ లాక్ 3 నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ప్రవేశించేవారికి ఇకపై ఈ పాస్ ( E Pass ) సులభతరం అవుతోంది. ఈ పాస్ అప్లై చేసుకున్నవెంటనే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతి లభించేస్తుంది. అన్ లాక్ 3 నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది.
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణను కట్టడి చేసేందుకు ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏపీలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్నించి వచ్చేవారెవరైనా సరే...ఎలా వచ్చినా సరే ఈపాస్ ద్వారా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నిన్నటివరకూ చాలా ఈ పాస్ లు పెండింగ్ లో ఉండేవి. కారణం సదరు వ్యక్తి వచ్చే ప్రాంతం ఎటువంటిది, ఏ జోన్ పరిధిలో వస్తుందనేది ఆలోచించి అనుమతి ఇవ్వడమా లేదా అనేది ఉండేది. దీనివల్ల కాలయాపన జరగడంతో పాటు చాలామంది ఈ పాస్ కోసం నిరీక్షిస్తుండేవారు.ఇప్పుడు అన్ లాక్ 3 ప్రారంభమైన నేపధ్యంలో ఈ పాస్ విధానంలోని ఆంక్షల్ని సడలించింది. కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ ( Covid 19 Task force committee ) ఛైర్మన్ సడలించిన ఆంక్షల్ని వివరించారు.
స్పందన వెబ్ సైట్ ( Spandana website ) లో ఎంట్రీ చేసుకున్న వెంటనే ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కు వచ్చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవెంటనే ఆటోమెటిక్ గా వచ్చేస్తుందిది. ఈ పాస్ తో పాటు గుర్తింపు కార్డును చెక్ పోస్ట్ వద్ద చూపిస్తే చాలు అనుమతిస్తారు. రాష్ట్రంలోకి ఎంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే ఈ పాస్ ను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్తకర్తలకు పంపించి...వారి ఆరోగ్యంపై నిఘా పెడతారు. ఈ పాస్ కావల్సినవారు www.spandana.ap.gov.in వెబ్ సైట్ లో నమోదు చేయించుకోవల్సి ఉంటుంది.