Ambedkar Statue: స్టాట్యూ ఆఫ్ జస్టిస్‌గా అంబేద్కర్ విగ్రహం, జనవరి 24న ప్రారంభించేందుకు ఏర్పాట్లు
Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 24న ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని తెలుస్తోంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా రూపుదిద్దుకుంటున్న అంబేద్కర్ స్మృతివనం వివరాలు ఇలా ఉన్నాయి..
Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు చుట్టూ చక్కని స్మృతివనం ఏర్పాటు చేస్తోంది. నిర్ణీత గడవులోగా పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జనవరి 24న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం సాక్షిగా 125 అడుగుల ఎత్తులో కొలువుదీరుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా ఉండనుంది. విగ్రహం అడుగున పీఠం 81 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆపై విగ్రహం 125 అడుగులు ఎత్తులో ఉంటుంది. విగ్రహం చుట్టూ గార్డెన్ ఉంటుంది. ఈ స్మృతివనంలోనే అన్ని మౌళిక సదుపాయాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తున్నారు. స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా ఉద్యానవనం, నడకదారిలో గ్రీనరీ ఉండనుంది. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఏ ఒక్క పని పెండింగులో ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. జనవరి 24న ప్రారంభానికి సిద్ధం కానుందన్నారు. మరోవైపు కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడుగునా 1.2 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాంతంలో పార్క్, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు.
అంబేద్కర్ స్మృతివనం దేశంలోనే చారిత్రాత్మకమైన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు అని చెప్పారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని తెలిపారు.
Also read: Lokesh Padayatra: నేటి నుంచే నారా లోకేశ్ పాదయాత్ర, విశాఖ వరకే యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook