Mansas Trust: ఏపీలోని మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం భూముల్లో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని మాన్సాస్ ట్రస్ట్(Mansas Trust), సింహాచలం భూముల్లో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయనేది ప్రధానమైన విమర్శ. భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతో ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమీషనర్‌ను నియమించింది.


సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో భారీగా భూముల్ని(Simhachalam lands issue) తొలగించినట్టు గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం (Ap government)ఆదేశించింది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది. 


Also read: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook