AP Caste Census: బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కులగణన చేపట్టి సంచలనం రేపింది. దశాబ్దాల తరబడి ఈ ప్రక్రియ జరగకపోవడంతో అన్ని రాష్ట్రాలు బీహార్ వైపు ఆసక్తిగా చూశాయి. అదే సమయంలో ఏపీ కులగణనపై ప్రకటన చేసింది. ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోందనేది స్పష్టంగా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం బీహార్ అయితే రెండవ రాష్ట్రం ఏపీ కానుంది. కులగణన వివరాలు బీహార్ ప్రభుత్వం వెల్లడి చేసిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం కులగణనపై ప్రకటన చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు దీనికి సంబంధించి శిక్షణ కూడా నడుస్తోంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టనుంది. అయితే కులగణన ఎలా చేయాలి, అవసరమేంటి, ఉపయోగాలేంటనే వివరాలతో తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 


ఏపీలో కులగణనకై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ చేసిన కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆమోదించింది. సామాజిక, ఆర్ధిక, విద్యా, ఉపాధి అంశాలను కులాల వారీగా ఈ ప్రక్రియలో పొందుపర్చనుంది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట మార్గదర్శకాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయం విభాగం సర్వే నిర్వహణకు నోడల్ విభాగంగా ఉండబోతోంది. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబం పూర్తి వివరాలు సేకరించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ యాప్ రూపొందించింది. సేకరించిన డేటాను డిజిటల్ పద్ధతిలో యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ డేటా భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. 


రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం వివరాలు కుల గణనలో ఉండాల్సిందేనని, ఏ కుటుంబం మిస్ కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబాల వివరాల నమోదుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సి ఉంటుంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో కులగణన ప్రచారం చేయనుంది. ఇదే అంశంపై గ్రామాల్లో చాటింపు వేయనున్నారు. ఇప్పటికే దీనికోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం 10 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.


దేనికి ఉపయోగిస్తారు


కులగణన ప్రక్రియతో సేకరించే సమాచారాన్ని ఏ ప్రభుత్వం పధకంలో లింక్ చేయమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.కేవలం సంక్షేమ పధకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు సంబంధించిన డేటా పూర్తిగా లేకపోవడంతో సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది కలుగుతోందని అందుకే కులగణన చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. 


Also read: Trains Cancelled: రైలు ప్రయాణీకులకు గమనిక, విజయవాడ పరిధిలో భారీగా రైళ్లు రద్దు, దారి మళ్లింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook