APPSC JOBS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వందల పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఉద్యోగాల కొలువు దీరనుంది. ఏపీపీఎస్సీ(APPSC)నుంచి పెద్దఎత్తున నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 12 వందల పోస్టుల భర్తీకు నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. దీనికి సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలతో ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2 సహా 12 వందల పోస్టుల భర్తీకై ఆగస్టు నెలలో నోటిఫికేషన్ వెలువడవచ్చు. ఇటీవల ప్రభుత్వం(Ap government) జారీ చేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరికి అపోహలు తలెత్తాయని..కానీ ఇందులో నిజం లేదన్నారు. ఇప్పటి వరకూ ఏపీపీఎస్సీ పరిధిలో 1180 ఖాళీ పోస్టుల వివరాలున్నాయి. ఇవి కాకుండా గ్రూప్-1, గ్రూప్-2 కేటగరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశముంది. 2018లో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్ధులు లభించక 364 పోస్టులు భర్తీ కాలేదు. ఇప్పుడు అన్ని వివరాలతో..మరిన్ని పోస్టులు కలుపుకుని 12 వందలకు పైగానే ఖాళీలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.


Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook