EWS Reservations: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీలో మోక్షం కలగనుంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు అందించాల్సిన ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కేటగరీలో లేకుండా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం(Central government) నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఏపీలో సరిగ్గా అమలు కాలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఈ పదిశాతం రిజర్వేషన్లు నిబంధనలకు విరుద్ధంగా విభజించారు. ఇందులో 5 శాతం రిజర్వేషన్లను కాపు సామాజికవర్గానికి కేటాయించి..మిగిలిన 5 శాతం అగ్రవర్ష పేదలకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం కావడంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాపులు కూడా తాము బీసీలమా లేదా ఈబీసీకు చెందినోళ్లమా తేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడాన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమని భావించి..టీడీపీ ప్రభుత్వం(TDP Government)జారీ చేసిన ఉత్తర్వుల్ని కొట్టివేసింది. అప్పట్నించి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాకుండా నిలిచిపోయాయి.


ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు నడుం బిగించారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదం లేకుండా రిజర్వేషన్ల అమలుకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా విద్యాఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసింది. ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ కేటగరీకు చెందనివారిలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఈడబ్ల్యూఎస్(EWS Reservations) కింద ఉద్యోగాల భర్తీ రోస్టర్ పాయింట్లను ప్రత్యేకంగా నిర్ణయించనున్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగరీలో కల్పించే పదిశాతం రిజర్వేషన్లలో మూడవ వంతు అదే వర్గానికి చెందిన మహిళలకు కేటాయించనున్నారు. అర్హులైనవారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని తహశీల్దార్లకు కల్పించారు. 


Also read: Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook