Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా మరో రెండ్రోజులు ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 15, 2021, 09:49 AM IST
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా మరో రెండ్రోజులు ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత 2-3 రోజుల్నించి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా రాయలసీమలో విస్తారంగానూ, కోస్తాంధ్రలో అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్‌లకు తూర్పు తీరంలో ఈ అల్పపీడనం ఏర్పడిందని..ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రంవైపుకు కదులుతోందని ఐఎండీ పేర్కొంది.దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గనుంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌జోన్ సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ విస్తరించడంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains)కురిసే సూచనలున్నాయి.

Also read: AP Government: ఏపీ ప్రభుత్వం మరో ఘనత, ఇన్సూరెన్స్ ఉచిత వైద్యంలో దేశంలో టాప్‌ప్లేస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News