AP Curfew: ఏపీలో కఠిన ఆంక్షలు, మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ
AP Curfew: కరోనా ఉధృతి నేపధ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తుండగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Curfew: కరోనా ఉధృతి నేపధ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తుండగా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. రోజురోజుకూ దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్(Oxygen Shortage), బెడ్స్, మందుల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశాలలో సంపూర్ణ లాక్‌డౌన్ ( Lockdown) అమల్లో ఉండగా..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ (Night Curfew) అమల్లో ఉంది.
అయితే గత కొద్దిరోజులుగా ఏపీ(Ap)లో కూడా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నియంత్రణ కోసం కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం (Ap government) ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ( Partial Curfew) ఇచ్చింది.అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమలు కానుంది.రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. రెండు వారాల కర్ప్యూలో మద్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత..తిరిగి ఉదయం 6 గంటల వరకు దుకాణాలన్నీ మూసేయాల్సి ఉంటుంది.
Also read: Sabbam Hari's death: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇక లేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook