New Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండి
New Ration Cards: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. కొత్త రేషన్ కార్డుల జారీకు షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి. రేషన్ కార్డుల జారీకై షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ నెలలో మొత్తం ప్రక్రియ చేపట్టనుంది. వచ్చే సంక్రాంతి నాటికి రేషన్ కార్డుల పంపిణీ కూడా పూర్తి కావచ్చు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రేషన్ కార్డుల జారీకై అర్హులైనవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన అనంతరం అర్హులైనవారికి రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు-చేర్పులకు అవకాశముంటుంది. సంక్రాంతి నాటికి అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి సంక్రాంతి కానుక అందించనుంది.
రాష్ట్రంలో అందిస్తున్న వృద్ధాప్య, వితంతు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, దీపం-2 పథకానికి , బియ్యం కార్డులకు రేషన్ కార్డు కావల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అందుతాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల జారీలో , మార్పులు చేర్పుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఆ సమయంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండానే ఉన్నవి కూడా తొలగించారనే విమర్శలున్నాయి. అందుకే ఈసారి రేషన్ కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు తలెత్తకుండా పగడ్బంధీ చర్యలు తీసుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో రేషన్ కార్డులు కీలకపాత్ర పోషించనున్నాయి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయవచ్చు.
Also read: IPL 2025 Kavya Maran Strategy: రెండో రోజు వేలంలో కావ్య మారన్ ప్లాన్ ఇదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.