Ap Government: మరింత బలోపేతం కానున్న ఫోరెన్సిక్ శాఖ
Ap Government: నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఇక నుంచి మరింత బలోపేతం కానుంది. దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకంగా మారనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Ap Government: నేర పరిశోధనలో అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఇక నుంచి మరింత బలోపేతం కానుంది. దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకంగా మారనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం(Ap Government) ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో భాగంగా నేర పరిశోధనపై ప్రధానంగా దృష్టి సారించింది. కీలకమైన ఫోరెన్సిక్ మౌళిక సదుపాయాల్ని పటిష్టపరుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్ వ్యవస్థ అంతా హైదరాబాద్‌కు పరిమితమైపోయింది. ఫలితంగా నేర పరిశోధన ఆలస్యమై దోషులను గుర్తించడం, నేరాన్ని నిరూపించడంలో జాప్యం జరిగేది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోనే ఫోరెన్సిక్ సైన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక ల్యాబొరేటరీలతో మౌలిక వసతులను కల్పిస్తూనే.. మరోవైపు పూర్తిస్థాయిలో నిపుణుల నియామకం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.
రాష్ట్రంలో ఏడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లతోపాటు(Centre of Excellence)పెద్దఎత్తున నిపుణుల నియామక ప్రక్రియను సర్కారు చేపట్టింది. అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడలలో దిశ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల (Ap Forensic Labs)ఏర్పాటుకోసం డీపీఆర్‌లను ఆమోదించింది. డీఎన్‌ఏ పరిశోధన సామర్థ్యాన్ని మూడింతలు..సైబర్ నేర పరిశోధన మౌలిక వసతుల సామర్థ్యాన్ని ఐదింతలు పెంచింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామక ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 58 మంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 8 వేల 127 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 3 వేల 481 మంది అర్హత సాధించగా 58 మందిని ఎంపికచేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల్లో 22 మందిని నియమించి శిక్షణనిస్తోంది.
Also read: AP Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook