AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టడంపై చర్యలు తప్పవని హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లు(Intermediate Admissions) ప్రారంభమైపోయాయి. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించేశాయి. ఈ అంశంపై ప్రభుత్వం (Ap government)ఆగ్రహం వ్యక్తం చేసింది. అనధికారికంగా చేపట్టిన అడ్మిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆడ్మిషన్లు ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. నోటిఫికేషన్ అధికారికంగా ప్రభుత్వం నుంచి వెలువడకుండా ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యమంగా కొంతమంది విద్యార్ధులైతే అడ్మిషన్ తీసుకుని..ఫీజులు కూడా చెల్లించినట్టు సమాచారముంది. ఈ అడ్మిషన్లు చెల్లుబాటు కావని..ఫీజుల్ని తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేకపోతే ఆ కళాశాలల గుర్తింపు రద్దు సహా..నిబంధనల మేరకు చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. 


Also read: ఈఎస్ఐ కుంభకోణంలో నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook