AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) సంక్రమణ నేపధ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ( Educational institutions ) మూతపడ్డాయి. తొలుత ఆగస్టు నుంచి విద్యాసంస్థల్ని ప్రారంభించే ఆలోచన చేసినా...కరోనా విజృంభణ నేపధ్యంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నుంచి ఏపీలో విద్యాసంస్థల్ని ( Ap Schools re open from september ) ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంవత్సరం ప్రశ్నార్ధకమైంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభించాలని అనుకున్నా అదీ సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల్ని తెరవనున్నట్టు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ( Ap ready to start schools from september ) విన్నవించింది. పాఠశాలల సురక్షిత ప్రణాళికపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఏ రాష్ట్రాలు ఎప్పుడు పాఠశాలల్ని తెరవాలనుకుంటున్నాయో చెప్పాలని కేంద్రం కోరింది. ఆ తరువాత మార్పులు చోటుచేసుకుంటే ఆ సమాచారం అందించాలని కేంద్రం మరోసారి కోరింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh Government ) సెప్టెంబర్ 5 ( September 5th ) నుంచి విద్యాసంస్థల్ని తిరిగి ప్రారంభించాలనుకునట్టు కేంద్రానికి నివేదించింది. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఏపీలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. Also read: AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం
ఇక ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాలు ఆగస్టులోనే తెరవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. Also read: AP Districts: ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభం