ఆంధ్రప్రదేశ్ ( Andhr pradesh ) లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ( Parliament constituency ) ఒక జిల్లా చొప్పున 25 జిల్లాలా లేదా అదనంగా మరో జిల్లా ఉంటుందా ? కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పటికి పూర్తికాబోతుంది ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తన పాదయాత్ర ( jagan padayatra ) లో ఇచ్చిన హామీ అమలుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకు తగ్గట్టుగా ఇప్పుడు కార్యాచరణ ప్రారంభమైంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ( Ap districts re organising committee ) లో కీలకమైన ఘట్టంగా భావించే పునర్ వ్యవస్థీకరణ కమిటీను ఛీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. సాధ్యాసాధ్యాల్ని, ఇబ్బందుల్ని, సాంకేతిక అంశాల్ని, ఖర్చును ఈ కమిటీ అధ్యయనం చేసిన తరువాత జిల్లాల రూపకల్పన ఉంటుంది. అయితే వచ్చే యేడాది మార్చ్ నాటికి జిల్లాల ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం జన్ ( Cm jagan ) నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో కొత్త జిల్లాల్ని వచ్చే ఉగాది ( new districts will start on ugadi ) నాటికి ప్రారంభించి..తెలుగు ప్రజలకు నూతన సంవత్సర కానుక అందించాలన్నది లక్ష్యంగా ఉంది.
కొత్త జిల్లాలు 25 కాదు...26 కావచ్చు:
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలన్న ఆలోచన ప్రకారం రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పుడున్న 13 జిల్లాలు 25 గా మారనున్నాయి. అయితే అనంతపురం, కర్నూలు జిల్లాలో చాలాకాలంగా పుట్టపర్తి, ఆదోని జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీనిపై కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. అయితే అంతకంటే ప్రదాన సమస్య అరకు పార్లమెంట్ నియోజకవర్గం విషయంలోనే ఎదురుకానుంది. ఎందుకంటే అరకు పార్లమెంట్ భౌగోళికంగా దేశంలోనే పెద్ద నియోజకవర్గం. దీని పరిధి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల గిరిజన ప్రాంత పరిధిలో ఉంది. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారనుంది. తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District ) రంపచోడవరం వాసులకు గానీ, విజయనగరం, శ్రీకాకుళం గిరిజన ప్రాంత ప్రజలకు గానీ అరకు భౌగోళికంగా చాలా దూరమవుతుంది. అందుకే ఇక్కడ మరో జిల్లా అదనంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. Also read: AP: కొత్త జిల్లాలకు రంగం సిద్ధం, కమిటీ ఏర్పాటు
రాయలసీమ ( Rayalaseema ) లోని నాలుగు జిల్లాలు 8 జిల్లాలుగా ఏర్పడనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు 5 జిల్లాలుగా మారనున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు 4 జిల్లాలుగా ఏర్పడనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాలుగా ఏర్పడనుంది. ఇక ఉత్తరాంధ్ర ( Uthrandhra ) లోని మూడు జిల్లాలు 5గా ఏర్పడతాయా లేదా 6 గానా అనేది కమిటీ నిర్ణయించాల్సి ఉంది. ఉత్తరాంధ్రను 5 గా కాకుండా 6 జిల్లాలుగా చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే
ఉగాదికి ప్రారంభం:
ఏదేమైనా రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రక్రియను మార్చ్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం ( Ap government decision ) గా ఉంది. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానుందని తెలుస్తోంది.