AP Governor Biswabhusan harichandan:  ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న  వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు. గవర్నర్‌ అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవర్నర్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఏఐజీ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి.. గవర్నర్‌కు అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సీఎంకు వివరించారు. ఏపీ గవర్నర్‌ ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (Telangana governor tamilisai) ఆకాక్షించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బిశ్వభూషణ్‌ త్వరగా కోలుకుని దేశానికి సేవచేయాలని పేర్కొన్నారు.


Also Read: APSRTC News Today: ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలను పెంచినట్లు ఉత్తర్వులు జారీ


ఆయన వయస్సు 87 సంవత్సరాలు. బిశ్వభూషణ్‌(AP Governor Biswabhusan harichandan)కు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్  2019 జూలై 24న ఏపీ గవర్నర్‌(AP Governor)గా బాధ్యతలు స్వీకరించారు. 1971లో జన సంఘ్‌లో చేరిన బిశ్వభూషణ్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-09 మధ్య ఒడిశా మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ గుర్తింపు పొందారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook