అమరావతి: కరోనా వైరస్ (COVID-19 spread) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ నివారణ కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు వేగంగా అమలు చేయడం కోసం ఏపీ సర్కార్ (AP govt) ప్రత్యేక ప్రణాళిక రచించింది. అందులో భాగంగానే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ప్రతీ జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే ఆయా ఐఏఎస్ అధికారులు వారిని నియమించిన జిల్లాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Coronavirus in AP: ఏపీకి వచ్చే వారికి సీఎం జగన్ విజ్ఞప్తి


జిల్లాల వారీగా నియమితులైన ఐఏఎస్ అధికారుల వివరాలు
శ్రీకాకుళం - ఎంఎం నాయక్ (Srikakulam dist - MM Naik)
విజయనగరం - వివేక్ యాదవ్ (Vizianagaram dist - Vivek Yadav)
విశాఖ - కాటంనేని భాస్కర్ (Visakha dist - Katamneni Bhaskar)
తూర్పు గోదావరి - బి.రాజశేఖర్ (East Godavari dist - B Rajasekhar )
పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్ (West Godavari dist - Praveen Kumar )
కృష్ణా - సిద్దార్థ్ జైన్ (Krishna dist - Sidharth Jain)
గుంటూరు - కాంతిలాల్ దండే (Guntur dist- Kantilal Dande)
ప్రకాశం - ఉదయ లక్ష్మి ( Prakasam dist - Udaya Laxmi)
నెల్లూరు - బి.శ్రీధర్ (Nellore dist - B Sridhar) 
కర్నూలు - పీయూష్ కుమార్ ( Kurnool dist - Peeyush Kumar)
కడప - శశిభూషన్ కుమార్ (Kadapa dist - Shashibhooshan Kumar)
అనంతపురం - భాస్కరరావు నాయుడు (Anantapuram dist -Bhaskarrao Naidu)
చిత్తూరు - రాంగోపాల్ (Chittore dist - Ramgopal).