Pension Kanuka Hike: జనవరి ఒకటో తేదీ నుంచి అయిదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కానుక పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. లబ్ధిదారులకు రూ.2,250 నుంచి రూ.2,500 పెన్షన్​ కానుక పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంచిన మొత్తంతో కలిపి.. లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు మంత్రి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ పెంచిన పెన్షన్ కానుక​ మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి. పెన్షన్ పెంచుతామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారాయన.


జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు..  అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు, జిల్లా యంత్రాంగం పెరిగిన పెన్షన్ పెంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నట్లు చెప్పారు.


మొత్తం ఖర్చు, లబ్ధిదారులు ఇలా..


పెన్షన్​ కోసం రూ.1,570.60 కోట్లను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మంది కొత్తగా పెన్షన్ పరిధిలోకి రానున్నారు. వీరితో కలిపి మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు అందించనుంది ప్రభుత్వం.


రూ.2500 కేటగిరిలో పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 52,40,718. ఇందులో వృద్ధులతో పాటు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, మత్స్యకారులు సహా వివిధ లబ్ధిదారులు ఉన్నారు.


దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన ఆనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా మెడికల్ పెన్షన్లను అందిస్తోంది ప్రభుత్వం.


  • రూ.3 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 7,46,633

  • రూ.5 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 29,932

  • రూ.10 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 13,750

  • అభయహస్తం కింద రూ.500 పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 1,43,560


Also read: Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు


Also read: Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook