Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 12:07 PM IST
  • చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
  • మృతులు కడప జిల్లా వాసులుగా గుర్తింపు
Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Chittoor district) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా...మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట (Reniguta) మండలం కుక్కలదొడ్డి వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే...

రేణిగుంట నుండి రైల్వేకోడూరు వైపు వెళ్తున్న కారు..లారీని ఓవర్టేక్ చేయబోయి..ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Eluru Rape Case: యువతిపై సీఐ అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

ప్రమాదంలో మృతి చెందిన వారిని కడప జిల్లా (Kadapa Residents) వాసులుగా గుర్తించారు. రాజంపేట మండలం చెర్లోపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మయ్య(40), నరసమ్మ(60)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజూకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News