Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!

Jahnavi Dangeti creates record to Complete NASA Programme: యూఎస్‌కు చెందిన నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీటెక్‌ సెకెండియర్ చదువుతోన్న జాహ్నవి రికార్డ్ నెలకొల్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 05:04 PM IST
  • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అమ్మాయి రికార్డ్..
  • నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న జాహ్నవి దంగేటి
  • మనదేశం నుంచి తొలి పార్టిసిపేషన్
  • ఆసియా ఖండంలోనే రికార్డ్
Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!

Andhra Pradesh girl Jahnavi Dangeti creates record Becomes First Indian To Complete NASA Programme: పశ్చిమగోదావరి (West Godavari) జిల్లాలోని పాలకొల్లుకు (Palakollu) చెందిన జాహ్నవి దంగేటి రికార్డ్ నెలకొల్పింది. బీటెక్‌ సెకెండియర్ చదువుతోన్న జాహ్నవి.. యూఎస్‌కు చెందిన నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో (International Air and Space Program) పాల్గొని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి వరకు మనదేశం నుంచి ఇలాంటి పార్టిసిపేషనే లేదు. జాహ్నవి రికార్డ్ కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. ఆసియా ఖండానికి మొత్తం కూడా రికార్డే.

జాహ్నవి దంగేటి (Jahnavi Dangeti) గత నవంబర్‌ 12న యూఎస్‌కు వెళ్లింది. అక్కడి నాసాకు చెందిన స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సైన్స్‌ సెంటర్‌‌లో ఆస్ట్రోనాట్‌ ప్రోగ్రామ్‌లో (astronaut program) ట్రైనింగ్ పూర్తి చేసింది. 22న ఈమె తిరిగి ఇండియాకు వచ్చింది. ఆ పదిరోజుల్లో జాహ్నవి దంగేటి పలు అంశాల్లో శిక్షణ పొందింది. 

జీరో గ్రావిటీతో మల్టీ యాక్సెస్‌ ట్రైనింగ్.. అండర్‌వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ వంటి విషయాల్లో తర్పీదు పొందింది జాహ్నవి దంగేటి. అలాగే ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపడం కూడా జాహ్నవి దంగేటి నేర్చుకుంది. అంతేకాదు... మిషన్‌ కంట్రోలర్‌కి ఫ్లైట్‌ డైరెక్టర్‌గా ఉండి.. పలు దేశాలకు చెందిన 16 మంది యువతతో కూడిన టీమ్‌కు కూడా నేతృత్వం వహించింది జాహ్నవి దంగేటి.

Also Read : AP Omicron Cases: ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు

సెస్నా 171 స్కైహాక్‌ అనే రాకెట్‌ను (Rocket‌) సక్సెస్‌ఫుల్‌గా లాంచ్‌ చేసింది జాహ్నవి. దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించి.. తిరిగి జాగ్రత్తగా ల్యాండ్‌ చేసింది. స్కూబా డైవింగ్‌ సంబంధించి మొదట గోవాలో (Goa) ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్‌ తీసుకుంది జాహ్నవి. తర్వాత అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో (Scuba diving‌) అడ్వాన్స్‌డ్‌ కోర్స్ పూర్తి చేసింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే (Zero Gravity) ఉండాల్సి వస్తుంది.. అలాగే నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ కోసమే స్కూబా డైవింగ్‌ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంది జాహ్నవి. ఫ్యూచర్‌‌లో పైలట్‌ ఆస్ట్రోనాట్‌ అవుతానని జాహ్నవి దంగేటి పేర్కొన్నారు.

Also Read : AP Pension Increase: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచి రూ.2,500 పంపిణీకి ఉత్తర్వులు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News