కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా రికవరీ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 12 వందల మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా నిర్ధారణ పరీక్షల్లో ( Covid 19 tests ) ఇప్పటికే 11 లక్షల మార్క్ ను దాటిన ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) చికిత్స విషయంలో కూడా ఆశించిన ఫలితాల్ని సాధిస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ( Ap Health Department ) తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) ఆదేశాల మేరకు ముందు నుంచి కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఇప్పటివరకూ 11 లక్షల 36 వేల 225 పరీక్షలు చేయగలిగామని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో 20 వేల 590 మందికి పరీక్షలు నిర్వహించగా...1813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 27 వేల 235కు చేరుకుంది.  ఇందులో చికిత్సతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14 వేల 393గా ఉంది. గత 24 గంటల్ల 1199 మంది డిశ్చార్డ్ కావడం విశేషం. గత నాలుగు రోజులుగా డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య వేయి దాటుతుండటంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. రికవరీ రేటు ఏపీ ( Recovery rate in Ap ) లో ఆశించిన స్థాయిలో ఉండటం మంచి పరిణామంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు ( Corona Active cases in Ap ) 12 వేల 533 ఉన్నాయి. Also read: YSR BOOK: తెలుగు పుస్తకాల్లో రికార్డు సాధించిన నాలో..నాతో..YSR


రానున్న 3 నెలల్లో ఇంటింటికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఐ మాస్క్, కరోనా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. Also read: AP: మరో వినూత్న ప్రయోగం: కరోనా బస్సులుగా ఇంద్రబస్సులు