AP High Court: గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు, అప్పీల్‌కు వెళ్తామంటున్న ప్రభుత్వం
AP High Court: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP High Court: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఆరు నెలల్లోగా తిరిగి పరీక్ష నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో 2018లో గ్రూప్స్ రాసిన అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీపీఎస్సీ 2018లో 167 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డిజిటల్ ఎవాల్యుయేషన్ తరువాత రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్ధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీపీఎస్సీ మాత్రం నిబంధనల మేరకే మూల్యాంకనం చేసినట్టు వాదించింది. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మళ్లీ మెయిన్స్ నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చారు. ఒకటి కంటే ఎక్కువసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని ఏపీ ేహైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను రద్దు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఆరు నెలల్లోగా పరీక్ష నిర్వహణ, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
అయితే ఇప్పటికే ఎంపికైన గ్రూప్ 1 ఉద్యోగులు ఈ తీర్పుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఏపీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తెలంగాణలో కూడా గ్రూప్ 1 పరీక్షల్ని హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్ష పేపర్లు లీక్ కావడంతో కొందరు అభ్యర్ధులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, పరీక్షలు రద్దు చేసి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
Also read: Paytm Services: మార్చ్ 15 తరువాత పేటీఎంలో ఏ సేవలు పనిచేస్తాయి, ఏవి పనిచేయవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook