Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఉపశమనం లభించింది. ఎన్నిక రద్దు చేసి రీ పోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన వివిధ పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటీషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక(Tirupati Bypoll) ఏప్రిల్ 17న జరిగింది. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని..ఉపఎన్నికను రద్దు చేసి రీ పోలింగ్ (Tirupati Repolling) నిర్వహించాలని బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిలు విడివిడిగా హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ గంగాగారవుల ధర్మాసనం విచారించింది. పిటీషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ కొట్టివేసింది.


ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై ఆర్టికల్ 329 ప్రకారం నిషేధముందని..ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే చట్టప్రకారం ఉన్న ప్రత్యామ్నాయమార్గాల్ని ఉపయోగించుకోవచ్చని హైకోర్టు ( Ap High Court) తెలిపింది. మరోవైపు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను మే 3వ తేదీకు వాయిదా వేసింది. ఎన్నికలకు అనుమతిచ్చిన ధర్మాసనం ఓట్ల లెక్కింపును నిలిపివేసింది. దీనికి సంబంధించి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.


Also read: Ap Inter Examinations: యధాతథంగా ఏపీ ఇంటర్ పరీక్షలు, నేటి నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook