AP High Court: ఏపీ గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
AP High Court: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఆటంకం కలిగింది. ఏపీ హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ప్రకారం రేపట్నించి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఆటంకం కలిగింది. ఏపీ హైకోర్టు స్టే విధించింది. షెడ్యూల్ ప్రకారం రేపట్నించి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది.
ఏపీలో గ్రూప్ 1 ఇంటర్వ్యూలు రేపట్నించి ప్రారంభం కావల్సి ఉంది. అంతలో హైకోర్టు తీర్పు కారణంగా నిలిచిపోయాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల్ని డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ (Digital Valuation) చేయడాన్ని సవాలు చేస్తూ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (AP High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్వ్యూలను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. డిజిటల్ వాల్యుయేషన్ గురించి చివరి దశలో చెప్పారని..పిటీషనర్ వాదించగా..నిబంధనల ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు జరిగాయని, వాల్యుయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు..ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే (Stay on Group 1 Interviews) విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు ఆదేశించింది.
Also read: AP SSC exams 2021, AP inter Exams 2021: ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు ఎప్పుడు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook