AP High Court: పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు
AP High Court: కొత్త పీఆర్సీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు వివాదం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది.
AP High Court: కొత్త పీఆర్సీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు వివాదం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. సమ్మెకు సిద్ధమయ్యాయి. పీఆర్సీ అమలు నిలిపివేసేంతవరకూ చర్చల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. మరోవైపు ఇదే విషయమై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హైకోర్టును (Ap High Court) ఆశ్రయించాయి. రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై ఇరువర్గాల మధ్య వాదన సాగింది. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదనేది ఉద్యోగుల వాదనగా ఉంది. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని ఉద్యోగుల తరపు న్యాయవాది తెలిపారు. అయితే పీఆర్సీ విషయమై ఉద్యోగులు ప్రభుత్వాన్ని(Ap government) ఎలా బెదిరిస్తారని ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరపు వాదన విన్పించారు. సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా..కోర్టులో పిటీషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు.
ఇరు పక్షాల వాదన అనంతరం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో(New PRC) జీతాలు తగ్గాయో , పెరిగాయో చెప్పాలని పిటీషనర్లకు హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటీషన్ ఎలా వేస్తారని మొట్టికాయలు వేసింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే..ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిన కోర్టు తదుపరి విచారణను మద్యాహ్నానికి వాయిదా వేసింది.
Also read: Lockdown: రాష్ట్రంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దిశగా ఆలోచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.