ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap High court ) మరోసారి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి ( Ex Cm Chandrababu naidu ) చంద్రబాబు నాయుడు పిటీషన్ పై స్పందించింది. కమీషన్ లో చంద్రబాబుకు సైతం అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరమైన ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. అటువంటిదే మరో పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం ఎక్కువైందంటూ ఇప్పటికే ఏపీ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో అంశం తెరపైకి వస్తోంది. 


స్టేట్ సెక్యూరిటీ కమీషన్లో ( Ap State security commission ) ప్రతిపక్ష నేతగా తనకు  స్థానం లేకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నాయుడు వేసుకున్న పిటీషన్ పై హైకోర్టు వెంటనే స్పందించింది. స్టేట్ సెక్యూరిటీ కమీషన్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని( Ap Government ) ఆదేశించింది. ఈ మేరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ హైకోర్టు. తక్షణం ప్రతిపక్షనేత చంద్రబాబు పేరు స్టేట్ సెక్యూరిటీ కమీషన్లో నమోదు చేస్తూ నెల రోజుల్లో జీవో ఇవ్వాలంటూ సవివరంగా స్పందించింది కోర్టు. ప్రతిపక్షనేత పేరు స్టేట్ సెక్యూరిటీ కమీషన్లో లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. Also read: AP: సమ్మె బాట పట్టిన థియేటర్లు, రేపట్నించి తెర్చుకోనట్టే