అన్ లాక్ 5 ( Unlock 5.0 ) లో ధియేటర్లు ( Theatre ) తెర్చుకోవచ్చని కేంద్ర మార్గదర్శకాలు ( Central Guidelines ) చెబుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెర్చుకునే పరిస్థితులు కన్పించడం లేదు. ఎగ్జిబిటర్లు నిరసన బాటపడ్డారు.
కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచం మొత్తం చవిచూసిన లాక్ డౌన్ ( Lockdown ) తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మార్చ్ నెల నుంచి సినిమాలు విడుదల కాలేక నష్టాల్లో కూరుకుపోయింది పరిశ్రమ. ఫ్రధానంగా ధియేటర్లపై తీవ్ర ప్రభావం పడిందనేది ఆ వర్గాల వాదన. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెర్చుకోడానికి అనుమతివ్వాలని చాలాకాలంగా ఆ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి అన్ లాక్ 5 లో భాగంగా థియేటర్లు తెర్చుకోడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అక్టోబర్ 15 నుంచి అంటే రేపట్నించి థియేటర్లు తెర్చుకోనున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు తెర్చుకునే పరిస్థితులు కన్పించడం లేదు. కారణం ఎగ్జిబిటర్లకు నిరసన బాట పట్టడమే.
గత ఏడు నెలలుగా నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని ధియేటర్ యజమానులు కోరుతున్నారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఫిలిం చాంబర్స్‌లో బుధవారం ఉదయం ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన బకాయిల రద్దు ఇంకా కాలేదని...తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదని ఎగ్జిబిటర్లు ( Ap Exhibitors on strike ) నిర్ణయించారు. మంత్రి పేర్నినానితో కూడా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలని...ఈ సమస్యల్ని చిరంజీవి, నాగార్జునల సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) వద్దకు తీసుకెళ్లామని ఎగ్జిబిటర్లు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ కనీస చార్జీలు వేశారని..ఒక్కో థియేటర్‌కు ఈ 7 నెలల కాలంలో 4 లక్షల రూపాయలు వచ్చిందన్నారు.
ఇపుడున్న పరిస్థితుల్లో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుందని..కరోనా కారణంగా 5 వందల వరకూ థియేటర్లు కరెంట్ బిల్లులు కట్టలేదన్నారు. నిర్వహణ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని..కరెంటు ఫీజులు రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఎగ్జిబిటర్లు తెలిపారు. డబ్బున్న వాళ్లు కోవిడ్ సమయంలో కరెంట్ చార్జీలు కట్టారని..కట్టలేని వాళ్లు చాలా మంది ఉన్నారని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఆక్యుపెన్సీ విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని కోరుతున్నారు. Also read: AP: భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
AP: సమ్మె బాట పట్టిన థియేటర్లు, రేపట్నించి తెర్చుకోనట్టే