AP HRC Office: మూడు రాజధానుల దిశగా ఏపీ ప్రభుత్వం, కర్నూలులో తొలి కార్యాలయం ప్రారంభం
AP HRC Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో హెచ్‌ఆర్‌సి కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది.
AP HRC Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో హెచ్‌ఆర్‌సి కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది.
మూడు రాజధానుల దిశగా ఏపీ ప్రభుత్వం(Ap government)కీలక అడుగేసింది. న్యాయ రాజధాని కర్నూలులో హెచ్‌ఆర్‌సి కార్యాలయాన్ని మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి ప్రారంభించారు. కర్నూలులో సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు జస్టిస్ సీతారామమూర్తి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) పొంచి ఉన్న నేపధ్యంలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. మరోవైపు రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ రైతుల పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 316 పై చర్యల్ని హైకోర్టు నిలిపివేసింది. రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోవైపు హైకోర్టు స్టే ఇచ్చింది. అటు సంగం డెయిరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న రిట్ అప్పీల్‌ను హైకోర్టు(Ap High Court) తిరస్కరించింది.
Also read: AP Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook