Work from home: ఆ శాఖ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు. రెండు వారాలపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసిన కరికాల వలవన్.. అదే సమయంలో విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించారు. ( Read also : BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం )
ఏపీ ప్రభుత్వంలోనే ఓ భాగమైన పరిశ్రమల శాఖ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి లభించడంతో.. తమకు కూడా అలా ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ఇతర శాఖలకు చెందిన సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి విజ్ఞప్తిపై ఏపీ సర్కార్ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..