తుపాన్ దిశ అంచనా వేయడంలో కేంద్రం కంటే ఏపీనే బెటర్ - చంద్రబాబు
తుపాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ మోడీ సర్కార్ పై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా చురకలు అంటించారు
ఫొని తుపాను తీవ్రతపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాన్ వల్ల జరిగిన నష్టాన్ని చంద్రబాబు వివరించారు. తుపాను వల్ల ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం లేకుండా చూశామన్నారు. తుపాన్ దిశను సరిగ్గా అంచనా వేయడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు.
ఏపీ ప్రభుత్వం అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాను దిశను కల్చితంగా అంచాన వేయగల్గిందన్నారు. ఈ విషయంలో కేంద్రం కంటే ఏపీనే బెటర్ అని చంద్రబాబు తమ ప్రభుత్వం తీరును సమర్ధించుకున్నారు. ఒడిషాకు కేంద్రం కంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే ఉపయోగపడిందనే విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు