AP: ప్రభుత్వం పాలన చేస్తోందా లేదా హైకోర్టు చేస్తోందా?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. పాలన చేస్తుంది ఎవరో తేల్చమన్న ఏజీ ప్రశ్నకు...హైకోర్టు స్పందించింది. తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap HIgh court ) లో ఆసక్తికర వాదనలు సాగాయి. పాలన చేస్తుంది ఎవరో తేల్చమన్న ఏజీ ప్రశ్నకు...హైకోర్టు స్పందించింది. తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ ప్రభుత్వం ( Ap Government ).. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ( Mission build Andhra pradesh ) కోసం తలపెట్టిన ఆస్థుల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ అక్టోబర్ 12కు వాయిదా పడింది. అయితే ఈ వ్యాజ్యాల్లో చిన్నప్రశ్న దాగి ఉందన్నారు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ( Advocate General Sudhakar reddy ). రాష్ట్రంలో పాలన చేస్తున్నది ఎవరో తేల్చేస్తే సరిపోతుందని కోర్టుకు నివేదించారు. ఎందుకంటే న్యాయస్థానాల్ని వేదికగా చేసుకుని పిటీషన్లు వేసుకుంటూ సంక్షేమాన్ని అడ్డుకుంటున్నవాళ్లు పాలిస్తున్నారా లేదా ప్రజలతో ఎన్నుకోబడినవాళ్లు పాలన చేస్తున్నారో తేల్చాల్సిన అవసరముందని కోర్టుకు వివరించారు ఏజీ సుధాకర్ రెడ్డి.
దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ ( Justice Rakesh kumar ), జస్టిస్ జె ఉమాదేవి ( Justice J Umadevi ) లు వెంటనే స్పందించారు. మీరు కోర్టును ఉద్దేశించి అంటే తమని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? పాలన ప్రభుత్వం చేస్తోెందా లేదా హైకోర్టు చేస్తోందా అని ప్రశ్నించదల్చుకున్నారా ? అంటూ వ్యాఖ్యానించింది. పిటీషనర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నానని సుధాకర్ రెడ్డి వివరించారు. తాను అవాస్తవమైతే చెప్పలేదని తెలిపారు. పిటీషనర్లు ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి తమని కాల్చాలని చూస్తున్నారన్నారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుని...విషయం పక్కదారి పడుతోందని తెలిపింది.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం భూములు విక్రయించినప్పుడు సమాజ సేవకులంతా ఎక్కడికి వెళ్లారని ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రశ్నించారు. గతంలో నోరెత్తనివారంతా ఇప్పుడు కోర్టులకు వస్తూ సంక్షేమ పధకాల్ని అడ్డుకుంటున్నారన్నారు. ఎమ్మార్వో కార్యాలయం, శిశు సంక్షేమ శాఖ భూముల్ని సైతం ప్రభుత్వం విక్రయిస్తోందని పిటీషనర్ తెలిపారు. దీనిపై ఏజీ సుధాకర్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని మీరే నడపండి..సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తామిక్కడ ఉన్నది రాజకీయాలు చర్చించేందుకు కాదని ధర్మాసనం తెలిపింది. సంయమనంతో మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించింది. Also read: P Judiciary: హైకోర్టుకు..ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న అంతరం, ఎంపీల విమర్శలు